Read News in Telugu Language
adsdaksha

vemula : బీసి లకు రూ.1 లక్ష ఆర్థిక సహాయం నిరంతర ప్రక్రియ..

ప్రతి నెల నియోజక వర్గానికి 300 మందికి చొప్పున అందిస్తాం.

విద్య వైద్యం బలహీన వర్గాలకు ఆర్థిక సహాయం ..వీటిపైనే కేసిఆర్ దృష్టి..

– మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి.

విద్య,. వైద్యం, బలహీన వర్గాలకు ఆర్థిక సాయం ఈ మూడు అంశాలపైనే తెలంగాణ ( telangana ) ముఖ్యమంత్రి కేసిఆర్ దృష్టి సారించారని రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ( vemula prashanth reddy ) అన్నారు. ఆ దిశగా ఇప్పటికే పనులు జరుగుతున్నాయన్నారు. బిసిలకు చేసే రూ. 1 లక్ష ఆర్థిక సహాయం నిరంతర ప్రక్రియ అని అది ప్రతి నెల నియోజక వర్గానికి 300 మందికి చొప్పున అందిస్తాం అన్నారు. నిజామాబాద్ ( nijamabad ) జిల్లా బాల్కొండ ( balkonda ) నియోజకవర్గం వేల్పూర్ ( velpur ) మండల కేంద్రంలో సోమవారం నియోజకవర్గ బిసి కులవృత్తిదారుల్లో అర్హులైన లబ్ధిదారులకు రూ. 1 లక్ష ఆర్థిక సహాయం చెక్కులను మంత్రి లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, దేశం లో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి మంచి పనులు పేదల కోసం సీఎం కేసీఆర్ ( cm kcr ) చేస్తున్నారన్నారు.

Hospital

read also : vaish : సంపాదనలోనే కాదు ఆర్య‌వైశ్యులు సేవ‌ల్లోను ముందే..

సమాజం లో ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఎవరు ఆకలి తో అలమటించే పరిస్థితి ఉండకూడదని ఆలోచించే గొప్ప వ్యక్తి కేసీఆర్ అన్నారు.బిజెపి ,కాంగ్రెస్ వాళ్లకు ఎన్ని మంచి పనులు చేసినా కనబడదని, కోడి గుడ్డు మీద ఈకలు పికినట్లు వ్యవహరిస్తారన్నారు. గతం లో ఏ ప్రభుత్వం లో కూడా బీడీ కార్మికులకు పెన్షన్ లు ఇవ్వలేదు. ఎన్ని కష్టాలు వచ్చిన పెన్షన్ మాత్రం ఇప్పుడు టంచన్ గా ఇస్తున్నాం అన్నారు.

read also : చిందేసిన మంత్రి .. భోనమెత్తి మహిళలతో నృత్యాలు..

సంపద సృష్టించి పేదలకు పంచాలి అనేది సీఎం కేసీఆర్ సంకల్పమని మంత్రి వేముల అన్నారు. సాగు నీరు, ఉచిత కరెంట్ , తాగునీటి కోసం లక్షల కోట్లు ఖర్చుచేసి ప్రజలకు అందిస్తున్నాం అన్నారు. విద్య వైద్యం బలహీన వర్గాలకు ఆర్థిక సహాయం అందించడం ఈ మూడు అంశాలపైనే కేసిఆర్ దృష్టి సారించారని ఆ దిశగా ఇప్పటికే పనులు జరుగుతున్నాయన్నారు. ప్రజల ఆశీర్వాదం తో మూడోసారి కూడా కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని, కేసీఆరే తెలంగాణ ప్రజలకు శ్రీరామ రక్ష అన్నారు.

Leave A Reply

Your email address will not be published.