Read News in Telugu Language
adsdaksha

సారే కావాలి…కారే రావాలంటూ దివ్యాంగుడి జన చైతన్య యాత్ర ..

దక్ష న్యూస్, ఖమ్మం: అక్టోబర్ 11

సారే కావాలి…కారే రావాలంటూ ఓ దివ్యాంగుడు జన చైతన్య యాత్ర ( jana chaithanya yatra ) నిర్వహించిన సంఘటన మేడ్చల్ ( medchal ) జిల్లా మూడు చింతలపల్లి ( muudu chinthalapalli ) గ్రామం లింగాపూర్ తండా లో బుధవారం చోటు చేసుకుంది. వివరాల్లోకెళితే.. లింగాపూర్ తండాకు చెందిన దివ్యాంగుడు డి. మహేష్ కేసిఆర్ సర్కార్ కు మద్దతుగా మోటార్ సైకిల్ పై రాష్ట్ర వ్యాప్తంగా జన చైతన్య యాత్ర చేపట్టాడు. అందులో భాగంగా వేల్పూర్ ( velpur ) చేరుకున్న మహేష్ రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ( vemula prashanth reddy ) ని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా కేసిఆర్ ( kcr ) కి మద్దతుగా ప్రజలను చైతన్య పరిచేందుకు మహేష్ తన వంతుగా చేస్తున్న యాత్ర గురించి తెలుసుకున్న మంత్రి ఆయన్ను అభినందించారు.

Hospital

read also : మన వైద్యుడి చెంతకు విదేశీ పేషెంట్ లు .. వైద్యరంగంలో సంచలనం ..

ఈ సందర్భంగా మంత్రి వేముల మాట్లాడుతూ, కేసిఆర్ ది మానవీయ పాలన అని, దేశంలోనే ఎక్కడా లేని విధంగా దివ్యాంగులకు రూ.4016/- ఆసరా పెన్షన్ ఇస్తూ వారి జీవితానికి భరోసా కల్పించిన ఏకైక ప్రభుత్వం కేసిఆర్ దే అన్నారు. కేసిఆర్ చేసిన మంచిని, ఆయన పాలనలో ప్రగతిని సోదరుడు మహేష్ కర పత్రాలు పంచుతూ రాష్ట్ర వ్యాప్తంగా కేసిఆర్ కి మద్దతు కూడగట్టేందకు చేస్తున్న ప్రయత్నం అభినందనీయం అన్నారు.

Leave A Reply

Your email address will not be published.