Read News in Telugu Language
adsdaksha

ప్రతీ ఓటర్ కి స్లిప్పులు అందేలా చూడండి..

దక్ష న్యూస్, ఖమ్మం: నవంబర్ 14

ప్రతి ఓటరుకు ఓటరు స్లిప్పు అందేలా కట్టుదిట్టమైన కార్యాచరణను జిల్లాలో అమలు చేయాలని రాష్ట్ర సంయుక్త ప్రధాన ఎన్నికల అధికారి సర్ఫరాజ్ అహ్మద్ అన్నారు. మంగళవారం హైదరాబాద్ ( Hyderabad )  నుండి రాష్ట్ర సంయుక్త ప్రధాన ఎన్నికల అధికారి, ఇతర రాష్ట్ర స్థాయి అధికారులతో కలిసి వెబ్ క్యాస్టింగ్ నిర్వహణ, ఓటరు స్లిప్పుల పంపిణీపై జిల్లా ఎన్నికల అధికారులతో వీడియో సమావేశం ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పోలింగ్ కేంద్రాలలో వెబ్ క్యాస్టింగ్ నిర్వహణకు సంబంధించి ప్రత్యేక ప్రణాళిక రూపొందించు కోవాలని, దీనికి అవసరమైన మేర యంత్రాంగం సిద్దం చేసుకోవాలని, స్థానికంగా అందుబాటులో ఉండే కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న యువతను వెబ్ క్యాస్టింగ్ కోసం వినియోగించుకోవాలని సూచించారు.

ఎన్నికల నిర్వహణ సందర్భంగా ఓటరు స్లిప్పులు అందలేదని గతంలో అనేక ఫిర్యాదులు ఉన్నాయని సర్పరాజ్ అన్నారు. వీటి నివారణ కోసం ఎన్నికల కమిషన్ ముందస్తుగా ఓటరు స్లిప్పుల పంపిణీ కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించిందని, పోలింగ్ కేంద్రాల వారిగా ఓటరు స్లిప్పుల ముద్రణ చేసి వాటి పంపిణీ పకడ్బందిగా జరిగేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఓటరు స్లిప్పుల పంపిణీ పర్యవేక్షణ కోసం నోడల్ అధికారిని నియమించాలని, ఓటరు స్లిప్పుల పంపిణీ అంశంలో ఫిర్యాదులు ఉంటే వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు.

Read also: నా నామినేషన్ రిజెక్ట్ చేయించాలని చాలా కష్టపడుతున్నారు…

Hospital

ఓటరు స్లిప్పుల పంపిణీ షెడ్యూల్ ను రాజకీయ పార్టీల ప్రతినిధులకు ముందస్తుగా తెలియజేయాలని, వివిధ రాజకీయ పార్టీల బి.ఎల్.ఏ లను సైతం ఓటరు స్లిప్పుల పంపిణీలో భాగస్వామ్యం చేయాలని ఆయన తెలిపారు. ఓటరు స్లిప్పుల పంపిణీపై ప్రతి రోజూ నివేదికలు సమర్పించాలని, ప్రతి ఒక్క ఓటరుకు తప్పనిసరిగా ఓటరు స్లిప్పు అందేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఓటరు జాబితా పై వచ్చిన ఫిర్యాదులు, వాటిపై తీసుకున్న చర్యల వివరాల రిజిస్టర్ కట్టుదిట్టంగా నిర్వహించాలని సూచించారు. రాజకీయ పార్టీల ప్రతినిధుల, అభ్యర్థులకు, వారి అనుచరులకు సి విజిల్ యాప్ పై అవగాహన కల్పించాలని, సి విజిల్ యాప్ ను విస్తృతంగా వినియోగించడం వల్ల పారదర్శకంగా ఎన్నికల నిర్వహణకు, ఎన్నికల కోడ్ ఉల్లంఘనలను అరికట్టేందుకు ఉపయోగపడుతుందని అన్నారు.

వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఖమ్మం జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ మాట్లాడుతూ, వెబ్ కాస్టింగ్ ప్రక్రియకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఓటర్ స్లిప్పులు ప్రతి ఓటరుకు అందేలా కార్యాచరణ చేపట్టి, నోడల్ అధికారిని నియమించనున్నట్లు ఆయన తెలిపారు.

Read also : తుమ్మల ఓల్డ్ ఐఫోన్-5.. నేను లేటెస్ట్ ఐఫోన్..15

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ డి. మధుసూదన్ నాయక్, సిపిఓ ఏ. శ్రీనివాస్, ఎన్నికల విభాగ సూపరింటెండెంట్ రాంబాబు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.