Read News in Telugu Language
adsdaksha

హీరో విజయ్ ఆంటోని ఇంట తీవ్ర విషాదం..

కారణాలపై స్పందించని కుటుంబ సభ్యులు...

 

బిచ్చగాడు ( bichhagadu ) సినిమాతో తెలుగు ప్రజలకు పరిచయమైన హీరో విజయ్ ఆంటోని ( Vijay Antony) ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆయన కూతురు మీరా (17) ఆత్మహత్యకు పాల్పడింది. చెన్నైలోని చర్చి పార్క్ కాలేజ్‌లో మీరా  ( Meera) ఇంటర్ సెంకడియర్ చదువుతోంది.

విజయ్ ఆంటోనీ కూతురు మీరా మంగళవారం తెల్లవారుజామున మూడు గంటలకు తన గదిలోని సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. అయితే ఆమె ఆత్మహత్యకు చదువుల ఒత్తిడే కారణమని భావిస్తున్నారు.

విజయ్ ఆంటోని ఫాతిమా దంపతులకు పెద్ద కుమార్తె మీరా. విజయ్ కుటుంబం చెన్నైలోని డీడీకే రోడ్డులో నివాసం ఉంటోంది. కుమార్తె మీరా ఆత్మహత్యకు పాల్పడంతో విజయ్ ఆంటోని కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.

Hospital

మీరా మృతికి గల అసలు కారణాలు తెలియాల్సి ఉంది. ఇప్పటి వరకూ విజయ్ ఆంటోని తన కూతురి మృతిపై స్పందించలేదు.

కాగా.. విజయ్ ఆంటోని కూతురి మరణ వార్త తెలుసుకున్న సినీ ప్రముఖులు, అభిమానులు ఆయనకు సోషల్ మీడియా వేదికగా ధైర్యం చెబుతున్నారు.

మీరా మృతి పట్ల ఫిలిం ఇండస్ట్రీస్ సంతాపం వ్యక్తం చేసింది.

Read also : భక్తికి మతం అడ్డుకాదని నిరూపించిన ముస్లిం యువకుడు..

Leave A Reply

Your email address will not be published.