Read News in Telugu Language
adsdaksha

హైదరాబాద్ ఎంపీ సీటు మాదే.. ఎంఐఎంను ఖతం చేస్తం : కిషన్ రెడ్డి..

దక్ష న్యూస్, హైదరాబాద్ : ఫిబ్రవరి 12

హైదరాబాద్ పార్లమెంటు స్థానంలో బీజేపీ పోటీ చేసి విజయం సాధిస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ( kishan reddy ) ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎంఐఎం ( mim ) పార్టీని ఖతం చేస్తామని హెచ్చరించారు. పార్టీ కార్యాలయంలో కిషన్ రెడ్డి విజయ సంకల్పయాత్ర ( vijaya sankalpa yathra ) పోస్టర్‌ను ఆవిష్కరించారు.

read also : రాష్ట్ర ప్రభుత్వ కీలక నిర్ణయం .. ఏజ్ లిమిట్ 46 ఏళ్లకు పెంచిన సర్కార్..

Hospital

అనంతరం మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో 17స్థానాలు గెలుస్తామని స్పష్టం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ కు బీజేపీయే పోటీ అని భావిస్తున్నామన్నారు. ఖమ్మం, నల్లగొండలోనూ బీజేపీకి సానుకూల వాతావరణం ఉందన్నారు.

read also : మాదాంట్లోకొస్తే మంత్రి పదవి ఇస్తం : హరీశ్ రావుకు ఎమ్మెల్యే రాజగోపాల్ ఆఫర్..

కుటుంబ, అవినీతి పార్టీలకు నీతి, ధర్మం కోసం పనిచేస్తున్న బీజేపీకి మధ్య పోటీ అంటూ కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈనెల 20 నుంచి బీజేపీ విజయ సంకల్ప యాత్రలు నిర్వహిస్తున్నామని, 5 పార్లమెంటు క్లస్టర్లలో 5 విజయ సంకల్ప యాత్రలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఒక్కో క్లస్టర్‌కు ఒక్కో పేరు పెట్టామని, కొమరం భీమ్ యాత్ర, శాతవాహన యాత్ర, కాకతీయుల యాత్ర, కృష్ణమ్మ యాత్ర, భాగ్యనగర్ యాత్రల పేరుతో నిర్వహిస్తున్నామని వివరించారు.

 

 

Leave A Reply

Your email address will not be published.