Read News in Telugu Language
adsdaksha

తెలంగాణ సర్కార్ కూలిపోద్ది.. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు..

దక్ష న్యూస్, న్యూ ఢిల్లీ : పిబ్రవరి 5

మరికొద్ది రోజుల్లో తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని వైసీపీ ( ycp ) ఎంపీ విజయసాయిరెడ్డి ( vijayasai reddy ) సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రపతి ప్రసంగంపై రాజ్యసభలో సోమవారం జరిగిన చర్చలో వైసీపీ తరపున పాల్గొన్న విజయసాయిరెడ్డి కాంగ్రెస్ ( congress ) పార్టీ టార్గెట్ గా విమర్శలు గుప్పించారు. ఆ రాష్ట్రంలో హస్తం పార్టీ అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. ఏపీకి కాంగ్రెస్ విలన్ గా మారిందని అశాస్త్రీయంగా రాష్ట్రాన్ని విభజించిందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ కనుమరుగు కావడం ఖాయం చేశారు.

read also : monkee fever : అమ్మో మరో వైరస్..! కర్ణాటకను భయపెడుతున్న మంకీ ఫీవర్ ..

Hospital

ఏపీలో ఆ పార్టీకి నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయని విజయసాయిరెడ్డి ధ్వజమెత్తారు. 2029లో కూడా తాను ఎంపీగా ఉంటానని జోస్యం చెప్పారు. అప్పుడు కాంగ్రెస్ కు ఒక్క ఎంపీ కూడా ఉండరన్నారు. కాంగ్రెస్ ముక్త్ భారత్ అవుతుందన్నారు. కుటుంబాలను చీల్చడం కాంగ్రెస్ కు అలవాటు అని మండిపడ్డారు. పార్లమెంట్ తలుపులు మూసి రాష్ట్రాన్ని విభజించారని ఈ విషయాన్ని చరిత్ర మరువదన్నారు.

read also : మరో రెండు గ్యారెంటీలు..? అమలుకు సర్కార్ ప్లాన్..

ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్ కంటితుడుపు హామీ ఇచ్చిందని విజయసాయిరెడ్డి మండిపడ్డారు. ఏపీ కాంగ్రెస్ కు చిత్తశుద్ధి ఉంటే విభజన చట్టంలో ప్రత్యేక హోదా ఎందుకు పెట్టలేదని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. ఆ పార్టీని ప్రజలు త్వరలో బొంద పెడ్తారని ఏపీ ఎంపీ హెచ్చరించారు.

Leave A Reply

Your email address will not be published.