Read News in Telugu Language
adsdaksha

ఏమున్నదక్కో.. ఏమున్నదక్కా.. హస్తం గూటికి చేరిన రాములమ్మ..

దక్ష న్యూస్, హైదరాబాద్: నవంబర్ 17

గత కొద్ది రోజులుగా వస్తున్న విజయశాంతి పార్టీ మారనున్నారనే వార్తలకు ఫులుస్టాప్ పడింది. ఆమె శుక్రవారం తిరిగి తన సొంతగూటికే చేరారు. బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ విజయశాంతి హస్తం గూటికి చేరారు. హైదరాబాద్ గాంధీభవన్ లో శుక్రవారం మల్లికార్జున ఖర్గే.. ఆమెకు కండువాను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఇటీవల ఆమె బీజేపీకి పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కాంగ్రెస్ లో చేరినట్లు విజయశాంతి ట్వీట్ చేశారు. ‘ఎంతో ఆదరణతో, సమున్నతమైన గౌరవంతో స్వాగతించిన కాంగ్రెస్ అధిష్ఠానానికి, రాష్ట్ర నాయకత్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు..’ అంటూ తనను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించిన వారికి ధన్యవాదాలు అంటూ పోస్ట్ చేశారు. మరోవైపు మెదక్ ఎంపీ సీటు హామీతోనే ఆమె కాంగ్రెస్ లో చేరినట్లుగా ప్రచారం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇంఛార్జి మాణిక్ రావు ఠాక్రేతో పాటు మల్లు భట్టి విక్రమార్క, దుద్దిళ్ల శ్రీధర్ బాబు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Hospital

read also : ఆరు గ్యారంటీలతో పాటు 37 అంశాలతో కాంగ్రెస్ మేనిఫెస్టో రిలీజ్ ..

కాగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మార్పు చెందుతున్నాయి. చివర్లో పార్టీలు మారే వారి సంఖ్య బాగా పెరుగుతోంది. బీఆర్ఎస్, బీజేపీల నుంచి కాంగ్రెస్ లో ఎక్కువ మంది చేరుతున్నారు. ఎమ్మెల్యే అభ్యర్థుల ప్రకటన తర్వాత నేతల్లో అసంతృప్తులు, పార్టీల మార్పులతో రాజకీయ సమీకరణాలు రోజు రోజుకు మారుతున్నాయి. బండి సంజయ్ ను అధ్యక్ష పదవి నుంచి తొలగించిన నాటినుంచి రాములమ్మ బీజేపీకి దూరంగా ఉంటోంది. బిజేపిలో ఆమెకు టికెట్ కేటాయించకపోవడంతో పాటు పలు కార్యక్రమాలకు పిలువకపోవడంతో విజయశాంతి పార్టీ వీడాలని ఎన్నాళ్ళనుండో వేచి చూశారు. అందులో భాగంగానే తాజాగా విజయశాంతి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.

Leave A Reply

Your email address will not be published.