Read News in Telugu Language
adsdaksha

విజయీభవ.. కేసీఆర్ పాట సీడి ఆవిష్కరణ..

దక్ష న్యూస్, ఖమ్మం: అక్టోబర్ 22

కళాకారులకు అభినందనలు తెలిపిన మంత్రి కేటిఆర్..

ఉమ్మడి ఖమ్మం ( khammam ) జిల్లాకు చెందిన భద్రాచలం ( bhadrachalam ) వాసి చందమల్ల అభిలాష్ దర్శకత్వంలో వెలువడిన విజయీభవ కెసిఆర్ ( vijayee bhava kcr ) … అనే గీతం సీడీని హైదరాబాద్ ( hyderabad ) లోని ప్రగతి భవన్ ( pragathi bhavan ) లో మంత్రి కేటిఆర్ ( ktr ) విడుదల చేశారు. అనంతరం మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, మా లీగల్ సెల్ న్యాయవాది, నంది అవార్డు గ్రహిత లక్ష్మణ్ గంగ రాసిన పాట అద్వితీయమని, ఈ పాటకి తెలుగు బుక్ ఆఫ్ రికార్డు గ్రహిత ‘అభిలాష్ చందమళ్ళ’దర్శకత్వం వహించి మా పార్టీ చేసినటువంటి పథకాలన్నీ ఈ పాటలో చాలా చక్కగా చూపించారన్నారు. మంత్రి కేటిఆర్ దర్శకులు అభిలాష్ ను ప్రత్యేకంగా ప్రశంసించారు.

Hospital

read also : రాష్ట్ర ప్రజలకు సీఎం కేసిఆర్ దసరా శుభాకాంక్షలు..

ఇలాంటి పాటలకి దర్శకుడిగా మరెన్నో అద్భుత దశ్యకావ్యాల ఆవిష్కరణలకు రూపకర్త కావాలని మంత్రి కేటీఆర్ ఆకాంక్షిoచారు. నిర్మాత పత్తి ప్రవీణ్ కుమార్ కు, సంగీతం స్వరపరిచిన సంగీత దర్శకులు సురేష్ బొబ్బిలికి, ఎడిటర్ చెన్నూరి శివకుమార్ కు, మంత్రి కేటిఆర్ అభినందనలు తెలిపారు. ఈకార్యక్రమంలో హైకోర్టు బార్ అసోసిషన్ ఉపాధ్యక్షులు కళ్యాణ్ రావు చెంగల్వ, హైకోర్టు న్యాయవాదులు వేణు తదితరులు పాల్గొన్నారు…

read also : విజయదశమి ఎప్పుడు జరుపుకోవాలి..

Leave A Reply

Your email address will not be published.