Read News in Telugu Language
adsdaksha

పక్కాగా ఓట్లను లెక్కించాలి.. ప్రతిదీ రికార్డు అవుతుంది..

దక్ష న్యూస్, ఖమ్మం: మే 28

చిన్న పొరపాటు జరగొద్దు.. కౌంటింగ్ కు పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలి.. పటిష్టమైన భద్రత కల్పించాలి..
ఈసీఐ నిబంధనలను పాటించాలి.. ఎప్పటికప్పుడు ఫలితాలను ఆన్లైన్లో నమోదు చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్  ( vikash Raj ) కౌంటింగ్ ఏర్పాట్లపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.

వచ్చే నెల నాలుగో తేదీన జరగనున్న పార్లమెంటు ఎన్నికల ఓట్ల లెక్కింపును పక్కాగా నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ అధికారులను ఆదేశించారు. సీసీ కెమెరాల ద్వారా కౌంటింగ్ హాల్లో ప్రతిదీ రికార్డు అవుతుందని, సిబ్బంది జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. మంగళవారం హైదరాబాద్ నుంచి పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్లపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్, అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, ఆర్వోలు, ఏఆర్వోలు, సీపీలు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.

Read also: ప్రశాంతంగా ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్.. తనిఖీలు నిర్వహించిన కలెక్టర్ వి.పి. గౌతమ్..

ఖమ్మం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్, కమీషనర్ అఫ్ పోలీస్ సునీల్ దత్,
నగర పాలక సంస్థ కమీషనర్ ఆదర్శ్ సురభి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. సత్యప్రసాద్, వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.

కౌంటింగ్ సందర్భంగా చేపట్టాల్సిన జాగ్రత్తలపై సిఇఓ దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి మాట్లాడుతూ, చిన్న పొరపాటు జరగకుండా ఓట్ల లెక్కింపు నిర్వహించాలని సూచించారు. సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలని, నిర్లక్ష్యంగా ఉండవద్దని పేర్కొన్నారు. ఆయా జిల్లాల్లో కౌంటింగ్ కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు.

Hospital

నాలుగో తేదీన ఉదయం 8.00 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభించాలని, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు, ఈవీఎంల ఓట్లు ఒకేసారి లెక్కించాలని పేర్కొన్నారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ త్వర త్వరగా చేపట్టాలని, జాప్యం జరగకుండా ఎప్పటికప్పుడు అధికారుల అప్రమత్తంగా వ్యవహరించాలని తెలిపారు. ఫలితాల ప్రకటన కోసం మీడియా సెంటర్ ను ఏర్పాటు చేయాలని సూచించారు. రౌండ్ల వారీగా ఫలితాలను ఎప్పటికప్పుడు విడుదల చేయాలని, అన్ని నిర్ధారించుకున్న తర్వాతనే ఫలితాలను ప్రకటించాలని పేర్కొన్నారు.

Read also: జూన్ 2న తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాలు : రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి..

కౌంటింగ్ లో తప్పులు దొర్లితే ఇబ్బందులు పడాల్సి వస్తుందని వికాస్ రాజ్ హెచ్చరించారు. కౌంటింగ్ హాళ్ల వద్ద మూడంచెల పోలీస్ భద్రత ఏర్పాటు చేయాలని, ఇతరులు ఎవరూ రాకుండా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. అలాగే ఆయా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్టమైన బందోబస్తు కల్పించాలని తెలిపారు. కౌంటింగ్ పారదర్శకంగా జరిగేలా కౌంటింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని తెలిపారు. కౌంటింగ్ హాల్ బయట ఫలితాలు తెలిసేలా ఎల్ఈడీ స్క్రీన్ లను ఏర్పాటు చేయాలని సూచించారు.

ప్రతి నియోజకవర్గం నుంచి ఐదేసి వీవీ ప్యాట్స్ నుంచి ఓటర్ స్లిప్పులను తప్పనిసరి లెక్కించాలని ఆదేశించారు. ఆయా పార్టీల అభ్యర్థులు, ఏజెంట్లు, కౌంటింగ్ సిబ్బంది సెల్ ఫోన్లు కౌంటింగ్ కేంద్రాల్లోకి తీసుకెళ్లేందుకు ఎలాంటి అనుమతి లేదని స్పష్టం చేశారు. అదేవిధంగా ఎలక్ట్రానిక్ వస్తువులకు సైతం అనుమతి లేదని పేర్కొన్నారు. పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించిన అనంతరం సిబ్బంది, ఏజెంట్లను కౌంటింగ్ హాల్లోకి పంపించాలని సూచించారు. ఎలక్షన్ కమిషన్ ఆదేశాలను పాటిస్తూ కౌంటింగ్ ప్రక్రియను పూర్తి చేయాలని పేర్కొన్నారు.

అవసరమైన కంప్యూటర్లు, ఇంటర్నెట్, విద్యుత్తు సౌకర్యం ఉండేలా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని సూచించారు. రౌండ్ల వారీగా ఎప్పటికప్పుడు ఫలితాలను ఆన్లైన్లో నమోదు చేయాలని పేర్కొన్నారు. ఈవీఎంలను కౌంటింగ్ హాల్ కు తీసుకెళ్లే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, కౌంటింగ్ పూర్తి అయిన తర్వాత ఈవీఎంలు, ఎన్నికల సామాగ్రిని ఒకచోట భద్ర పరచాలని తెలిపారు. ఎన్నికల ప్రక్రియలో కీలకమైన కౌంటింగ్ సజావుగా సాగేలా అధికారులు అందరూ ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఎలాంటి తప్పులు జరగకుండా చూసుకోవాలని పేర్కొన్నారు.

ఈ సమావేశంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అదనపు కలెక్టర్ వేణుగోపాల్, జడ్పి సిఇఓ వినోద్, డిఆర్డిఓ సన్యాసయ్య, ఆర్ అండ్ బి ఎస్ఇ శ్యాంప్రసాద్, జిల్లా రెవెన్యూ అధికారిణి ఎం. రాజేశ్వరి, డి.ఎం. సివిల్ సప్లయ్స్ శ్రీలత, ఖమ్మం, కల్లూరు, కొత్తగూడెం, అశ్వారావుపేట ఆర్డీవోలు గణేష్, రాజేందర్ గౌడ్, మధు, అధికారులు, తదితరులు
పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.