Read News in Telugu Language
adsdaksha

విశాఖ టెస్టులో భారత్ విక్టరీ.. ఇంగ్లాండ్ పై 106 పరుగుల తేడాతో గెలుపు..

దక్ష న్యూస్, హైదరాబాద్: ఫిబ్రవరి 6

విశాఖపట్నంలో ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. 399 పరుగుల లక్ష్య ఛేదనలో 69.2 ఓవర్లలో 292 పరుగులకు ఇంగ్లాండ్ జట్టు ఆలౌట్ అయ్యింది. దీంతో 106 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. భారత బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్, బుమ్రా తలో మూడు వికెట్స్ పడగొట్టారు. ఈ గెలుపుతో టీమిండియా ఐదు టెస్టుల సిరీస్‌న 1-1తో సమం చేసింది. 67/1 ఓవర్ నైట్ స్కోరుతో సోమవారం ఆట ప్రారంభించిన ఇంగ్లీష్ జట్టు.. భారత బౌలర్ల ధాటికి ఆట మరో రోజు మిగిలుండగానే ఓటమిపాలైంది.

Hospital

Read also: తెలంగాణ నుంచి పోటీ చేయండి.. సోనియా గాంధీనీ కోరిన సీఎం రేవంత్ రెడ్డి..

ఇంగ్లాండ్ బ్యాట్స్ మెన్లలో జాక్ క్రాలే అర్ధసెంచరీతో రాణించాడు. 132 బంతుల్లో 8 ఫోర్లు, సిక్సర్ తో 73 పరుగులు చేశాడు. మిగతా ఆటగాళ్లలో ఎవరూ భారీ స్కోర్లు చేయకపోవడంతో ఇంగ్లండ్ కు ఓటమి తప్పలేదు. బెన్ ఫోక్స్(36), టామ్ హార్ట్లీ(36) కాసేపు పోరాడారు. వీరిద్దరినీ బుమ్రా అవుట్ చేశాడు. అంతకుముందు శ్రేయస్ అయ్యర్ అద్భుతమైన ఫీల్డింగ్ తో బెన్ స్టోక్స్ ను రనౌట్ చేశాడు. బెన్ స్టోక్స్ అవుట్ కావడంతో మ్యాచ్ టీమిండియా చేతుల్లోకి వచ్చింది. మిగతా మూడు వికెట్లను చకాచకా పడగొట్టి భారత్ బౌలర్లు జట్టును భారీ విజయాన్ని అందించారు. ఈ గెలుపుతో అభిమానుల్లో ఆనందం నెలకొంది.

Leave A Reply

Your email address will not be published.