Read News in Telugu Language
adsdaksha

కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ.. ఐటీ నోటీసులు జారీ..

దక్ష న్యూస్, హైదరాబాద్: మార్చి 29

లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆదాయపు పన్ను అంశంలో కాంగ్రెస్‌కు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఆ పార్టీకి ఐటీ శాఖ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ విషయాన్ని కాంగ్రెస్ నేత వివేక్ తంఖా శుక్రవారం వెల్లడించారు. 2017-18, 2020-21 సంవత్సరాలకు సంబంధించి రూ.1823 కోట్ల పెనాల్టీ, వడ్డీ వసూలు కోసం డిమాండ్ నోటీసులు జారీ చేశారన్నారు.

తమపై ఐటీ శాఖ విచారణను నిలిపివేయాలంటూ పార్టీ పెట్టిన పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించిన వెంటనే ఈ పరిణామాలు చోటుచేసుకోవడం గమనార్హం.

Read also: ఈడీ ఫోన్ పాస్‌వర్డ్‌లను అడుగుతోంది : ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపణ..

Hospital

ఎలాంటి ఉత్తర్వులు, పత్రాలు లేకుండానే గురువారం తాజాగా నోటీసు జారీ చేశారని వివేక్ తంఖా ఆరోపించారు. ఇది అహేతుక, అప్రజాస్వామిక చర్య. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ప్రధాన ప్రతిపక్షాన్ని ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని దుయ్యబట్టారు. దీనిని న్యాయపరంగా సవాలు చేస్తామని తెలిపారు.

Read also: కేసీఆర్ చేసిన పాపాలు ఆయనకే తగిలాయి : మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి..

2017 నుంచి 2021 మధ్య కాలంలో ఆదాయపు పన్ను (IT) శాఖ చేపట్టిన రీ ఎగ్జామినేషన్ ప్రక్రియను నిలిపివేయాలని కోరుతూ కాంగ్రెస్ దాఖలు చేసిన పిటిషన్లను ఢిల్లీ హైకోర్టు గురువారం కొట్టివేసిన సంగతి తెలిసిందే.. అంతకుముందు, 2014-15 నుండి 2016-17 కాలానికి ఆదాయపు పన్ను శాఖ చేపట్టిన పునఃపరిశీలనను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను కూడా ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. ఈ రీఎగ్జామినేషన్‌కు సంబంధించి కాంగ్రెస్ బ్యాంకు ఖాతాల నుంచి ఐటీ శాఖ ఇప్పటికే రూ.135 కోట్లను రికవరీ చేసింది.

Leave A Reply

Your email address will not be published.