Read News in Telugu Language
adsdaksha

వాషింగ్టన్ డీసిలో తెలంగాణ మంత్రి.. మన గ్రామాలు స్వయం సమృద్ధిని సాధించాయి. .

దక్ష న్యూస్, హైదరాబాద్: సెప్టెంబర్ 1

ఉద్యమంలో ఎన్నారైల పాత్ర అమోఘం..

మన ప్రాంతం బాగుండాలి అనుకునే వాళ్ళే విశ్వమానవ సౌభ్రాతృత్వం కోరుకుంటారు

– అమెరికా పర్యటనలో మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి..

తెలంగాణ రాష్ట్ర ప్రగతి అప్రతిహతంగా కొనసాగుతున్నదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ( singireddy niranjan reddy ) అన్నారు. అమెరికా ( america ) పర్యటనలో ఉన్న మంత్రి తన నాలుగోరోజు పర్యటన సందర్భంగా శుక్రవారం వాషింగ్టన్ డిసి (washington dc ) లో ఎన్నారై ( nri ) లు ఏర్పాటుచేసిన మీట్‌ అండ్ గ్రీట్‌ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, తెలంగాణ ( telangana ) రాష్ట్రం ఏర్పాటు తరువాత మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పునరుద్ధరణ, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి, నూతన ప్రాజెక్టుల నిర్మాణంతో రాష్ట్రంలో సాగునీటి ముఖచిత్రం మారిపోయిందని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఒక ఇంజనీరింగ్ అద్భుతం అని కేంద్ర జలవనరుల సంఘం ( cwc ) ఇంజినీర్లు ప్రశంసించారని తెలిపారు.

read also : voa : వీ వో ఏ లకు ముఖ్యమంత్రి రాఖీ పండుగ కానుక..

Hospital

ఒకప్పుడు కంట్రోల్ బియ్యానికి ఎదురుచూసిన తెలంగాణ ఇవ్వాళ దేశానికి అన్నం పెట్టే స్థాయికి చేరుకున్నదని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. తెలంగాణ ఇవ్వాళ బియ్యం ఉత్పత్తిలో పంజాబ్‌ను దాటిందని, తెలంగాణలో ఇవ్వాళ ఎటు చూసినా ధాన్యపు రాశులు ఉన్నాయన్నారు. చిన్న కమతాల వల్ల ఫార్మ్ మెకనైజేషన్ కొంచెం క్లిష్టం అయిందని, ఉబరైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్ రావాల్సి ఉందన్నారు. దాని దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు తెలిపారు. వ్యవసాయంలో నూతన ఆవిష్కరణలు రావాలని వాటిని రాష్ట్రం తరఫున ప్రోత్సహిస్తున్నట్లు వెల్లడించారు.

వ్యవసాయ ఎగుమతులు, ఫుడ్ ప్రాసెసింగ్ మీద తెలంగాణ ప్రభుత్వం దృష్టి పెట్టినట్లు మంత్రి నిరంజన్ రెడ్డి  తెలిపారు. ఫుడ్ ప్రాసెసింగ్ ప్లాంట్ల ఏర్పాటుకు సన్నాహాలు మొదలయ్యాయన్నారు. ఆయిల్ పామ్ సాగుకు రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహం ఇస్తుందని, నూనెల దిగుబడుల మీద కేంద్రం పెట్టే లక్షల కోట్ల రూపాయలు దేశీయ రైతులకు ఇస్తే, నాలుగేళ్లలో వంట నూనెల్లో స్వయం సమృద్ది సాధించగలమని మంత్రి పేర్కొన్నారు. ముందు చూపు లేని కేంద్రం వల్లనే బియ్యం విషయంలో గందరగోళం నెలకొందని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు.

read also : ప్రగతి భవన్ లో ఘనంగా రాఖీ పండుగ వేడుకలు..

ఆరు నెలల ముందు మా వద్ద సరిపడా బియ్యం నిల్వలు ఉన్నాయన్న కేంద్రం, ఇప్పుడేమో నిల్వలు లేవని ఎగుమతులపై నిషేధం విధించిందన్నారు. తెలంగాణలో ఇవ్వాళ జీవ వైవిధ్యం తొణికిసలాడుతోందని, ఏ ఊరికి పోయినా టన్నుల కొద్ది చేపలు, రాష్ట్రవ్యాప్తంగా లక్షల సంఖ్యలో గొర్రెలు, కోళ్లతో తెలంగాణ గ్రామాలు స్వయం సమృద్ధిని సాధించాయన్నారు. తెలంగాణ ప్రజల జీవన ప్రమాణాల్లో గత తొమ్మిదేళ్ళలో గమనార్హమైన మార్పు వచ్చిందన్నారు.

 

మరోసారి కేసీఆర్ కి, మన ప్రభుత్వానికి మీ ఎన్నారైల ఆశీర్వాదం కావాలని కోరారు. మీరు బుద్ధి జీవులు.. ఆలోచించాలి. దుష్ప్రచారాన్ని తుత్తునియలు చేయాలి. తెలంగాణ అభివృద్ధి ప్రస్థానంలో సదా ఎన్నారైల తోడ్పాటు అవసరం అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ డిజిటల్ మీడియా డైరెక్టర్ కొణతం దిలీప్, ఎన్ఆర్ఐలు జయంత్ చల్లా, భువనేష్, రవి పల్లా, ఈశ్వర్ బండా తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.