Read News in Telugu Language
adsdaksha

కడియం వెళ్లాక పార్టీలో ఉత్సాహం పెరిగింది : హరీశ్ రావు

దక్ష న్యూస్, హైదరాబాద్, ఏప్రిల్ 1

కడియం శ్రీహరి బీఆర్‌ఎస్‌ నుంచి తప్పుకున్న తర్వాత పార్టీలో ఉత్సాహం పెరిగిందని, కార్యకర్తల్లో ఆయనకు గుణపాఠం చెప్పాలనే తపన ఉందని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. బీఆర్ఎస్ వరంగల్ పార్లమెంట్ విస్తృత స్థాయి సమావేశంలో కడియంపై హరీశ్ రావు విమర్శలు గుప్పించారు.

బీఆర్‌ఎస్‌ కడియంకు డిప్యూటీ సీఎంగా అవకాశం కల్పించిందని హరీశ్ రావు అన్నారు. పార్టీ ఎందుకు మారారు? కాంగ్రెస్‌లో కడియం మరో గ్రూపును పెడతారా? ఎన్టీఆర్, చంద్రబాబు, కేసీఆర్ లకు వెన్నుపోటు పొడిచిన వ్యక్తి కడియం శ్రీహరి’ అంటూ నిప్పులు చెరిగారు.

Hospital

Read also: మాటల తూటాలు.. మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యలపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫైర్..

తన కుమార్తెకు ఎంపీ టికెట్ అడిగాడని చివరి నిమిషంలో బీఆర్ ఎస్ కు ద్రోహం చేశాడని కడియం శ్రీహరి పై హరీశ్ రావు నిప్పులు చెరిగారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని హరీశ్ కోరారు.

జనగాం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. ‘కావ్య మా నాన్న (కడియం) బ్రాండ్ అంటుంది. ఎన్టీఆర్, చంద్రబాబు, కేసీఆర్ లకు వెన్నుపోటు పొడిచిన వ్యక్తి కడియం అన్నారు. అరూరి రమేష్, పసునూరి దయాకర్‌లను కడియం తరిమికొట్టారు. ప్రజలు కడియం లాంటి ద్రోహులను క్షమించరు. కడియం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని పల్లా అన్నారు.

Leave A Reply

Your email address will not be published.