Read News in Telugu Language
adsdaksha

మరపురాని మనిషి వైయస్ఆర్…పొంగులేటి శ్రీనివాస రెడ్డి

దక్ష న్యూస్, ఖమ్మం: సెప్టెంబర్ 2

నిరుపేద, మధ్యతరగతి కుటుంబాల్లో సంతోషం, సంక్షేమం కోసం అహర్నిశలు కష్టపడ్డ మరపురాని మనిషి వైయస్ఆర్ ( ysr ) అని తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ కో ఛైర్మన్ పొంగులేటి శ్రీనివాస రెడ్డి ( ponguleti srinivas reddy ) అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి ( y.s. rajashekhar reddy ) వర్థంతిని పురస్కరించకుని ఖమ్మం ( khammam ) లోని తన క్యాంపు కార్యాలయంలో, ఖానాపురంలో జరిగిన వేడుకల్లో పొంగులేటి పాల్గొన్నారు. వైయస్ చిత్రపటానికి, విగ్రహానికి పూలమాల వేసి నివాళ్లర్పించారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ మరపురాని మనిషిగా వైఎస్ఆర్ యావత్తు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారని కొనియాడారు.

read also : కాంగ్రెస్ జెండా రెపరెపలాడాలి.. తెలంగాణ ప్రచార కమిటీ కో ఛైర్మన్ పొంగులేటి

కాంగ్రెస్ ( congress) అధికారంలో ఉన్నప్పుడు వైయస్ఆర్ ముఖ్యమంత్రి ( cm ) హెూదాలో అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టారని పొంగులేటి అన్నారు. ఆ పథకాల ద్వారా లక్షలాది మంది పేదలకి లబ్ది చేకూరిందని తెలిపారు. అదే తరహా అభివృద్ధి, సంక్షేమ ఫలాలు ఇప్పుడు కూడా అందాలంటే రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అఖండ మెజార్టీతో ప్రజలు గెలిపించాల్సిన ఆవశ్యకత ఉందని పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక డిక్లరేషన్ (declaration ) లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసి చూపిస్తామని హామీ ఇచ్చారు.

Hospital

read also : గుండెనిండింది.. మనసు పొంగింది..పొంగులేటి నిలయం లో రక్షాబంధన్ వేడుకలు..

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ రాష్ట్ర నాయకురాలు మద్దినేని బేబి స్వర్ణకుమారి, డీసీసీబీ మాజీ ఛైర్మన్ మువ్వా విజయబాబు, డీసీసీబీ డైరెక్టర్ తుళ్లూరి బ్రహ్మయ్య, కార్పొరేటర్ లు దొడ్డా నగేష్ యాదవ్, మలీదు జగన్, వైరా మున్సిపల్ ఛైర్మన్ సూతగాని జైపాల్, మధిర నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు డాక్టర్ కోటా రాంబాబు, ఎంపీపీ గోసుమధు, షేక్ ఇమామ్, బోడా శ్రావణ్ కుమార్, కీసర పద్మజా రెడ్డి, కొంగర జ్యోతిర్మయి, బాణాల లక్ష్మణ్, ఉపేందర్, రాధాకృష్ణ, చల్లా రామకృష్ణ రెడ్డి, వెనిగళ్ల నాగేశ్వరరావు, కలకోట శ్రీకాంత్, యువనేత గోపి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.