Read News in Telugu Language
adsdaksha

గుట్టపైకి ఆటోలకు ఎంట్రీ.. ప్రారంభించిన ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య..

దక్ష న్యూస్, యాదగిరి గుట్ట : ఫిబ్రవరి 11

గత ప్రభుత్వంలో యాదగిరిగుట్ట పునర్ నిర్మాణం చేసిన తర్వాత పలు ఆంక్షలు విధించారు. అందులో భాగంగా గత ప్రభుత్వం గతేడాది మార్చి 28 నుంచి కొండపైకి ఆటోలను నిషేధించింది. దీంతో ఆటో డ్రైవర్లు రిలే నిరాహార దీక్షలకు దిగారు. ఘాట్ రోడ్డు సమీపంలో యాదరుషి విగ్రహం వద్ద దాదాపుగా 20 నెలల పాటు దీక్షలు కొనసాగించారు. తద్వారా శ్రీ లక్ష్మినరసింహా స్వామిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు అనేక ఇబ్బందులు తప్పలేదు. ఈ నేపథ్యంలో కొత్త గవర్నమెంట్ వచ్చినంక పలు మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా గుట్టపైకి ఆటోలకు ఎంట్రీ ఇచ్చింది. ఆదివారం నుంచి యాదగిరిగుట్టపైకి ఆటోలు నడుస్తున్నాయి.

Read also: సీఎం గారూ.. టైఫిస్ట్ పోస్టులు భర్తీ చేయండి.. సెక్రటేరియట్ ముందు ప్లకార్డులతో నిరుద్యోగుల నిరసన..

Hospital

ఆదివారం ఉదయం 10 గంటలకు ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య జెండా ఊపి ఆటోల రాకపోకలను పునరుద్ధరించారు. అసెంబ్లీ ఎన్నికల కోడ్ రావడంతో పోలీసుల సూచన మేరకు గత నవంబర్ లో దీక్షలు విరమించారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవడంతో ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య ఆటో డ్రైవర్లు, ఆలయ ఉద్యోగులు, పోలీసులతో పలు దఫాలుగా రివ్యూలు చేశారు.

Read also: హెలికాప్టర్ కూలి ఆరుగురు మృతి.. మృతుల్లో ‘యాక్సెస్ బ్యాంక్’ సీఈవో..

సాధ్యాసాధ్యాలపై అధికారులతో చర్చలు జరిపిన ప్రభుత్వం ఈ నెల 11 నుంచి కొండపైకి ఆటోలను అనుమతిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఆటోవాలలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.