Read News in Telugu Language
adsdaksha

లీగల్ నోటీసులు పంపి కేటీఆర్‌ బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు : యెన్నం శ్రీనివాస్ రెడ్డి ..

దక్ష న్యూస్, హైదరాబాద్ : ఏప్రిల్ 4

లీగల్ నోటీసులు పంపి కేటీఆర్‌ బెదిరించే ప్రయత్నం చేస్తున్నారని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ( yennam srinivasreddy ) మండిపడ్డారు. విచారణ కోరితే పరువు తీశారని కేటీఆర్ చెబుతున్నారని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ బాధితుడిగా పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు యెన్నం తెలిపారు. సాక్ష్యాధారాలు ఉన్నందున పోలీసు అధికారులు విచారిస్తున్నారని తెలిపారు. తాను కేటీఆర్ స్థానంలో ఉంటే ఫోన్ ట్యాపింగ్‌లో తన పాత్ర లేదని అధికారులకు లేఖ రాస్తానని యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు.

Hospital

read also : బీఆర్ఎస్ వాళ్ళు సిగ్గులేకుండా మాట్లాడుతున్నారు… ఒక్క సీటు కూడా మీకు రానివ్వం..

ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డితో పాటు మంత్రి కొండా సురేఖకు కేటీఆర్ లీగల్ నోటీసులు పంపారు. వాటితో పాటు పలు మీడియా సంస్థలకు, యూట్యూబ్ ఛానెల్‌లకు మరోసారి లీగల్ నోటీసులు పంపించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తనపై వచ్చిన ఆరోపణలకు వారం రోజుల్లోగా క్షమాపణలు చెప్పాలని లేదంటే పరువు నష్టం దావా వేస్తానని నోటీసుల్లో కేటీఆర్ హెచ్చరించారు. తప్పుడు ప్రచారాలు చేస్తే సీఎం అయినా ఊరుకునేది లేదని కేటీఆర్ ఇప్పటికే తేల్చి చెప్పారు.

Leave A Reply

Your email address will not be published.