Read News in Telugu Language
adsdaksha

యువజన కాంగ్రెస్ ఖమ్మం అసెంబ్లీ అధ్యక్షులుగా కొండూరి హృదయ్ కిరణ్ . .

దక్ష న్యూస్, ఖమ్మం: సెప్టెంబర్ 11

ఖమ్మం అసెంబ్లీ యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కొండూరి హృదయ్ కిరణ్ ( konduri hruday kiran )  ఖమ్మం ( khammam ) అసెంబ్లీ యువజన కాంగ్రెస్ అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. యువజన కాంగ్రెస్ ( youth congress) కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న ఖమ్మం మామిళ్ళగూడెంకు చెందిన కొండూరి హృదయ్ కిరణ్ ను రాష్ట్ర ఇంచ్చార్జ్ సురభి ద్వివేది ( surabhi dwivedi ) ఆదేశం మేరకు జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు యడ్లపల్లి సంతోష్ ( yadlapalli santhosh ) సోమవారం అసెంబ్లీ అధ్యక్షులుగా ప్రమోట్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

read also : బోగస్ ఓట్లకు కేరాఫ్ పువ్వాడ .. మువ్వా సంచలన వ్యాఖ్యలు..

Hospital

ఈ సందర్భంగా నూతన ఖమ్మం అసెంబ్లీ యువజన కాంగ్రెస్ అధ్యక్షులుగా ఎన్నికైన కొండూరి హృదయ్ కిరణ్ మాట్లాడుతూ తనకు ఈ అవకాశం ఇచ్చిన రాష్ట్ర మరియు జిల్లా అధ్యక్షులు శివసేన రెడ్డి కి, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు యడ్లపల్లి సంతోష్ కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర యువజన కాంగ్రెస్ ఇంచ్చార్జ్ సురభి ద్వివేది కి, ఖమ్మం పార్లమెంట్ యూత్ జోడో బూత్ జోడో డోర్ టూ డోర్ క్యాంపెనింగ్ ఇంచ్చార్జ్ శ్రీనివాస్ గోగాడ, ఖమ్మం జిల్లా ఇంచార్జ్ నాగిరెడ్డి సందీప్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపారు.

read also : గోత్రం లోను సైన్స్ ఉంది.. అదేంటో తెలుసుకోండి..

ముల్లు భట్టి విక్రమార్క , జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పూవ్వాళ్ళ దుర్గా ప్రసాద్, పట్టణ అధ్యక్షులు మహమ్మద్ జావిద్ నాయకత్వంలో ఖమ్మం అసెంబ్లీ పరిధిలో యూత్ కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు.

 

Leave A Reply

Your email address will not be published.