Read News in Telugu Language
adsdaksha

బల్లెమో.. బాణమో.. అయోమయంలో ఆంధ్రా ప్రజలు.. మారనున్న ఏపీ రాజకీయ ముఖ చిత్రం..

దక్ష న్యూస్, విజయవాడ : జనవరి 16

నేడో , రేపో షర్మిల కు పిసిసి చీఫ్..?

ఎన్నికలు సమీపిస్తున్నవేళ ఆంధ్రప్రదేశ్  ( andhrapradesh ) రాజకీయ ముఖచిత్రం శరవేగంగా మారిపోబోతోంది. తెలంగాణ ( Telangana) రాష్ట్రంలో ఎన్నికల వేళ వైఎస్ఆర్టీపీ ( YSR tp ) వ్యవస్థాపకురాలు వై.ఎస్. షర్మిల ( ys sharmila ) పోటీ చేస్తున్నట్లు ప్రకటించి ఎన్నికల ప్రచారం నిర్వహించిన సమయంలో ఆమె అన్న వదిలిన బాణం అన్న కామెంట్లు అందరికీ గుర్తే ఉన్నాయి. కానీ తెలంగాణ ప్రజలు వైఎస్ఆర్టీపీ ని ఆదరించకపోవడంతో షర్మిల పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి కాంగ్రెస్ ( congress ) కండువా కప్పుకున్న విషయం విదితమే. కాంగ్రెస్ లో షర్మిల తెలంగాణ నుండి పోటీ చెయ్యడం ఇష్టంలేని టి కాంగ్రెస్ నేతల సూచనలతో అధిష్టానం ఆమెను ఆంధ్రకే పరిమితం చేసింది. అయితే తాజాగా షర్మిలకు కాంగ్రెస్ అధిష్టానం ఏపీ పిసిసి చీఫ్ పదవి ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతుండడం సర్వత్రా చర్చానీయాంశంగా మారింది.

Read also: వందేభారత్ ప్రోమో రిలీజ్.. ఇదేం గొడవ భయ్యా.. రామ్ లల్లా విగ్రహ ప్రతిష్ట వేళ..

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వేళ షర్మిలకు కాంగ్రెస్ అధిష్టానం పీసీసీ చీఫ్ పదవి కట్టబెట్టాలని భావిస్తున్నట్లు అది నేడో రేపో కార్యరూపం దాల్చనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అదే నిజమైతే అన్న వదిలిన బాణం కాస్త ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి పక్కలో బల్లెంలా మారడం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు. దానికి తోడు ఏపీలో కాంగ్రెస్ బలోపేతానికి తనవంతు కృషి చేస్తానని షర్మిల సైతం చేరిక సమయంలో చెప్పుకొచ్చారు. ఇప్పుడు పీసీసీ పగ్గాలు తీసుకోవడం ద్వారా జగన్ ప్రభుత్వం పై వ్యతిరేకంగా గళం విప్పనున్నారు. అయితే షర్మిల రాకను గమనించిన జగన్.. కుటుంబాలను చీల్చేందుకు కూడా వెనకాడరని కౌంటర్ అటాక్ చేశారు.

Hospital

తాజాగా కీలక నేత గిడుగు రుద్రరాజు తన పదవికి రాజీనామా చేయడమే కాకుండా, షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని స్వాగతించారు. ఆమె నాయకత్వంలో పని చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. టిడిపి, వైసీపీలో టిక్కెట్లు దక్కని వారు తమతో టచ్ లో ఉన్నట్లు చెప్పుకొచ్చారు.

Read also: మకరజ్యోతి దర్శనం.. పోటెత్తిన భక్త జనం..

గిడుగు రుద్రరాజు పార్టీలో సీనియర్ నేత మాత్రమే కాదు, మాజీ సీఎం రాజశేఖర్ రెడ్డి కి, కెవిపి రామచంద్ర రావుకు అత్యంత సన్నిహితుడు. 2005 నుంచి 2007 వరకు వైద్య ఆరోగ్యశాఖ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చైర్మన్ గా, 2007 నుంచి 2011 వరకు ఎమ్మెల్సీగా, 2012లో ఉత్తరప్రదేశ్ ఎన్నికల పరిశీలకుడిగా వ్యవహరించారు. ఏపీ కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీగా కూడా పనిచేశారు. షర్మిలకు పిసిసి పగ్గాలు అప్పగించేందుకు.. రుద్రరాజు రాజీనామా చేశారు.

ఒకటి రెండు రోజుల్లో షర్మిల నియామక ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది. దీంతో జగన్ పై షర్మిల విమర్శలు చేసేందుకు వెనుకాడబోరని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. షర్మిల కాంగ్రెస్ పగ్గాలు తీసుకోవడం పట్ల
జగన్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.

Leave A Reply

Your email address will not be published.