Read News in Telugu Language
adsdaksha

శ్రావణ శుక్రవారం షర్మిల వినూత్న నిరసన..

దక్ష న్యూస్, హైదరాబాద్: ఆగస్ట్ 18

శ్రావణ శుక్రవారం పోలీసులకు హారతి ఇచ్చి వైఎస్సార్ తెలంగాణ పార్టీ ( ysr telangana party) అధినేత్రి వైఎస్ షర్మిల ( ys sharmila) వార్తల్లో నిలిచారు. ఇదేంటి షర్మిల పోలీసులకు హారతి ఇవ్వడమేంటి
అనుకుంటున్నారా ..! అవును ఇది నిజం. కాకపోతే ఇదో రకం వినూత్న నిరసన ..

తెలంగాణ ( telangana) రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టి అమలు చేస్తున్న దళితబంధు ( dalhithabandhu) పథకంలో అవినీతి జరిగిందని షర్మిల పదే పదే ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈ అక్రమాలపై ప్రభుత్వాన్ని నిలదీయటమే కాకుండా ఘాటు విమర్శలతో ఆమె తరచూ విరుచుకుపడుతున్నారు కూడా. అంతే కాకుండా అక్రమాలు జరిగాయని, తమ ఎమ్మెల్యేలే దళిత బంధు నిధులను స్వాహా చేస్తున్నారని సీఎం కేసీఆర్ ( cm kcr ) స్వయంగా చెప్పారని..అయినా వారిపై చర్యలు తీసుకోలేదు అంటూ షర్మిల విమర్శించిన విషయం విదితమే.

Hospital

ఈక్రమంలో గజ్వేల్ ( gajwel ) నియోజకవర్గంలోనే జయదేవ్ పూర్ ( jayadev pur)  మండలంలోని తీగుల్ ( theegul ) లో దళితబంధు పథకంలో అక్రమాలు జరిగాయని స్థానికులు ఆందోళన చేపట్టారు. దీంతో షర్మిల తీగుల్ వెళ్లి బాధితులను కలిసేందుకు రెడీ అయ్యారు. కానీ తీగుల్ కు వెళ్లకుండా షర్మిలను అడ్డుకునేందుకు పోలీసులు ఆమె నివాసం వద్దకు భారీగా చేరుకున్నారు. ఆమెను బయటకు వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. ఆమె పోలీసులను దాటుకుని బయటకు వెళ్లేందుకు ప్రయత్నిస్తే హౌస్ అరెస్ట్ చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. దాంతో షర్మిల పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. పోలీసులకు హారతి ఇచ్చి తన నిరసనను వినూత్నంగా వ్యక్తంచేశారు.

గతంలో కూడా షర్మిలను బయటకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్న సమయంలో పోలీసులకు ఆమెకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో షర్మిల పోలీసులపై చేయి చేసుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆమెను అరెస్ట్ చేశారు.

ఈరోజు శ్రావణ శుక్రవారం కావడం ఆమె నివాసం వద్దకు చేరుకొని అరెస్ట్ కు ప్రయత్నించిన పోలీసులకు షర్మిల హారతి ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.

Leave A Reply

Your email address will not be published.