కాళ్లు లాగేస్తున్నాయా
సయాటికా కావచ్చు..!
తక్షణ ఉపశమనం .. పూర్తి నిర్మూలన..
ఆక్యుపంచర్ తో సయాటికాకు చెక్..
-సంచలనాల ప్రకృతి థెరపిస్ట్.. పిసివి స్వామి.
Naturopathy : గంటల తరబడి కంప్యూటర్ ముందు కూర్చొని పనిచేసే సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు.. వ్యాపార సముదాయాల్లో కూర్చొని పనిచేసే ఉద్యోగులు.. అంతెందుకు గంటల తరబడి టీవీ చానల్స్ చూస్తూ గడిపే మహిళలు, వృద్ధులు ఇటీవల తరచూ ఎదుర్కొంటున్న సమస్య సయాటికా. 30 ఏళ్ళు పైబడిన వారి నుండి సీనియర్ సిటిజన్స్ వరకు కరెవ్వరూ సయాటికా కు అనర్హం అన్నట్లుగా పీడిస్తున్న ఈ సమస్య కొంతమందిని ఆపరేషన్ ధియేటర్ వరకు తీసుకెళ్తుంది అని చెప్పడంలో సందేహం లేదు.
Naturopathy : ఉన్నట్టుండి లేవడంతో కాలు పట్టేస్తుంది. పడుకుని లేచే వేళ నడుములో నొప్పి పడుతుంది. నిద్రలో పట్టే వీపు నొప్పి, వెన్ను నొప్పులు నిర్లక్ష్యంగా వదిలేస్తే అవికూడా సయాటికాకు దారి తీయవచ్చు.. సడన్ గా పట్టుకున్న నొప్పులే కాదు, గంటల తరబడి కూర్చొని పనిచేసే సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు కంప్యూటర్ ఆపరేటర్లు సయాటికా బారిన పడటం తరచూ చూస్తున్నాం. కూర్చుని పని చేస్తే సయాటికా వస్తుందా అంటే.. సరైన రీతిలో కూర్చోకపోవడం, సరైన రీతిలో నిలబడకపోవడం ..సరైన భంగిమలో కాకుండా ఇష్టారీతిన బరువులు ఎత్తే వారు ఈ సయాటికా బారిన పడతారు.

*అసలు సయాటికా అంటే ఏమిటి అది ఎందుకు వస్తుంది..*
మనిషికి వెన్నునుండి నడుము, తొడలు, కాళ్ళ లో నుండి పాదాలవరకు ఒక నరం ఉంటుంది. అదే సయాటికా నరం. ఇది L4, L5, S1, S2, S3 అనే ఐదు నరాలతో అనుసంధానమై ఉంటుంది. ఈ నరాల్లో వత్తిడి వల్ల ఏర్పడే సమస్యే సయాటికా. బరువులు ఎత్తేటప్పుడు సరైన రీతిలో ఎత్తకపోవడం, సరైన పద్ధతిలో కాకుండా ఎక్కువ సమయం కూర్చోవడం, ఎక్కువ సమయం నిలబడడం, వాహనాలు ఎక్కువ దూరం నడపడం వల్ల నరాలు ఒకదానిపై ఒకటి ఎక్కడం లేదా వత్తిడి, వాపులు వల్ల సయాటికా వస్తుంది. ఇవి కాక మరో ఐదు కారణాల వల్ల సయాటికా రావొచ్చు.
అయితే సయాటికాకు నిమిషాల్లో తక్షణ ఉపశమనం కలిగించడంతో పాటూ ఆపరేషన్ లు అవసరం లేకుండా ప్రకృతి వైద్యం, ఆక్యూ పంచర్, నేచురోపతి (Naturopathy ) ద్వారా సంతోషకర జీవితాన్ని అందిస్తున్నారు ఖమ్మం నగరానికి చెందిన *సిద్ధార్థ ప్రకృతి ఆరోగ్య కేంద్రం* నిర్వాహకులు థెరపిస్ట్ పి సి వి స్వామి. ప్రకృతి థెరపీ, ఆక్యు పంచర్, కపింగ్ థెరపీ, మ్యాగ్నెటిక్ థెరపీ, నాడిథెరపీ ఆయుర్వేద తో అన్ని రకాల మొండి వ్యాధులను సైతం ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా నయం చేస్తున్నారు. ఇప్పుడు సయాటికాకు కారణం అయ్యే మరో ఐదు కారణాల గురించి తెలుసుకుందాం.
*స్లిప్డ్ డిస్క్ (Herniated Disc):* వెన్నుపూసల మధ్య ఉండే డిస్క్ జరిగి లేదా పగిలి నరంపై ఒత్తిడి కలిగించడం దీనికి అత్యంత సాధారణ కారణం. (సుమారు 90% కేసుల్లో ఇదే ఉంటుంది)
*స్పైనల్ స్టెనోసిస్ (Spinal Stenosis):* వయసురీత్యా వెన్నుపాములోని నరాలు వెళ్లే మార్గం ఇరుకుగా మారడం.
*పైరిఫార్మిస్ సిండ్రోమ్ (Piriformis Syndrome):* తుంటి భాగంలో ఉండే 'పైరిఫార్మిస్' కండరం బిగుసుకుపోవడం లేదా తిమ్మిరి రావడం వల్ల సయాటిక్ నరం నొక్కబడుతుంది.
*బోన్ స్పర్స్ (Bone Spurs):* ఆర్థరైటిస్ వల్ల వెన్నుపూసలపై అదనపు ఎముకల పెరుగుదల ఏర్పడి నరాలను తాకడం.
*స్పాండలోలిస్థెసిస్ (Spondylolisthesis):* వెన్నుపూసలలో ఒకటి దాని కింద ఉన్న పూసపై ముందుకు జరగడం
*ఇతర కారకాలు:* గర్భధారణ సమయంలో శరీరంలో వచ్చే హార్మోన్ల మార్పులు, బరువు పెరగడం, మధుమేహం, ఊబకాయం, వెన్నుకు తగిలిన గాయాలు వల్ల సయాటికా సమస్యలు తలెత్తవచ్చు.
*నివారణ..*
పారిజాతం పువ్వులు, ఆకులు కషాయం చేసుకొని రెండు పూటలా తాగాలి.
రావి ఆకుల కషాయం రెండు పూటలా తాగినా ఉపశమనం ఉంటుంది.
*యోగాసనాలు:*
శలభాసనం, వృష్టాసనం వల్ల మెరుగైన ఫలితాలు సాధించవచ్చు.

*-పిసివి స్వామి
ప్రకృతి, ఆక్యు పంచర్, మ్యాగ్నెటిక్ మరియు నాడి థెరపీ, ఆయుర్వేద వైద్య నిపుణులు.*
ఫోన్: 9494446262, 9490700082


