ఖమ్మంలో ఐదు రోజుల పాటూ ఉచిత వైద్య శిబిరం..

తన తండ్రి జయంతి సందర్భంగా ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసిన కుమారుడు ..

పల్లా కిరణ్ కుమార్ ని అభినందిస్తున్న ప్రజలు..

పేదల పక్షపాతి.. పీడిత ప్రజల నాయకులు తన తండ్రి స్వర్గీయ కీ॥ శే॥ పల్లా జాన్ రాములు 85వ జయంతిని పురస్కరించుకొని ఖమ్మం ( khammam ) గరంలోని శాంతినగర్ మిషన్ హాస్పిటల్ ప్రాంగణం లో ది. 12-10-2023 నుండి 16-10-2023 వరకు ఐదు రోజుల పాటు ఉచిత వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు ప్రముఖ సామాజిక వేత్త పల్లా జాన్ రాములు తనయుడు పల్లా కిరణ్ కుమార్ ( palla kiran kumar ) తెలిపారు. తన తండ్రి జయంతి నవంబర్ 1 అయినప్పటికీ ప్రస్తుత వ్యాధుల సీజన్ దృష్టిలో ఉంచుకొని నిరుపేదలకు సకాలంలో వైద్యం అందించాలన్న ఉద్దేశ్యంతో ముందుగానే ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.

read also : మన వైద్యుడి చెంతకు విదేశీ పేషెంట్ లు .. వైద్యరంగంలో సంచలనం ..

పెద్దలకు, పిల్లలకు సంబంధించి వివిధ అనారోగ్య సమస్యలకు ఉచిత వైద్య శిబిరం లో పరీక్షలు నిర్వహించి వారికి సంబంధించిన మందులు ఉచితంగా వైద్య శిబిరములో పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. జ్వరము , దగ్గు , జలుబు , బి.పి., షుగర్ మరియు “చిన్న పిల్లలకు” సంబంధించిన అనారోగ్య సమస్యలకు నిపుణులైన వైద్యులచే వైద్యం అందిస్తామన్నారు. ఉదయం 11 గం॥ల నుండి మ॥ 1 గం॥ వరకు ఈ 5 రోజులు పాటు ప్రతిరోజు 2 గంటల పాటూ వైద్య శిబిరం నిర్వహించడునని తెలిపారు. ఖమ్మం నగర ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

 

Advertisement

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button