Vanama : మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు 82 వ జన్మదిన వేడుకలు ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ నగరంలో ఘనంగా నిర్వహించారు. వారి కుటుంబ సభ్యులు అభిమానుల సమక్షంలో ఈ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా వనమా వెంకటేశ్వరరావును ఖమ్మం జిల్లా మున్నూరు కాపు ట్రస్టు బోర్డు చైర్మన్ కనకం జనార్దన రావు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ శెట్టి రంగారావు సీనియర్ నాయకులు రాష్ట్ర కార్యదర్శి గోవింద్ శ్రీనివాసరావు, ఖమ్మం నగర అధ్యక్షులు మాజీ కార్పొరేటర్ రాపర్తి శరత్ నగర నాయకులు కాశం వినయ్ కుమార్ కలిసి వనమా కి పుష్పగుచ్చం అందించి శాలువా తో సత్కరించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

Vanama : అనంతరం వారు మాట్లాడుతూ వనమా నిండు నూరేళ్ళు ఆనందంగా ఆరోగ్యంగా జీవించాలని ఆకాంక్షించారు. స్థానిక నాయకులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.






