Telangana

Mp vaddiraju : మహిళల సాధికారత కోసం కొట్లాడి నిధులు తెస్తాం..

ఖమ్మం, నవంబర్ 3: ( దక్ష న్యూస్ )

By ·

Share this article
Mp vaddiraju : మహిళల సాధికారత కోసం  కొట్లాడి నిధులు తెస్తాం..

Mp vaddiraju : మహిళల  సాధికారత కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో కొట్లాడి మరిన్ని నిధులు తీసుకొచ్చేందుకు తన వంతు కృషి చేస్తానని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర చెప్పారు. పేదరికంలో  ఉన్న, ఒంటరి మహిళలు స్వయంకృషి, ఆత్మగౌరవంతో జీవించేందుకు ఉచిత నైపుణ్య శిక్షణా కేంద్రాలు ఎంతగానో దోహదపడుతాయన్నారు.  ఖమ్మం రైల్వే స్టేషన్ సమీపాన కే.సీ.పుల్లయ్య ఫౌండేషన్ నారీ నైపుణ్య శిక్షణా కేంద్రంలో మంగళవారం"ది గాడ్ థైరిస్సా మహిళా మండలి"ఆధ్వర్యాన ఏర్పాటు చేసిన ఉచిత కుట్టుమిషన్ల శిక్షణా తరగతుల ప్రారంభోత్సవానికి ఎంపీ రవిచంద్ర ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

Mp vaddiraju : ఈ సందర్భంగా ఆయన రిబ్బన్ కట్ చేసి, జ్యోతి ప్రజ్వలన చేసి జీ మాల్ ఉమా మహేశ్వరరావుతో కలిసి శిక్షణా తరగతులను ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో ఎంపీ రవిచంద్ర మాట్లాడుతూ,మహిళల పేదరికాన్ని పారదోలేందుకు, ఆర్థిక స్వావలంబనకు,ఆత్మ గౌరవంతో జీవించేందుకు కే.సీ.పుల్లయ్య ఫౌండేషన్, థెరిస్సా మహిళా మండలి,ఎస్వీ కన్స్ట్రక్షన్స్ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. హైదరాబాద్,విజయవాడలలోని భారతరత్న డాక్టర్ బీ.ఆర్.అంబేడ్కర్ విగ్రహాలను నెలకొల్పడంలో పుల్లయ్య ఫౌండేషన్ ప్రధాన భూమిక పోషించిందన్నారు. రాజకీయాలకు అతీతంగా మానవీయ దృక్పథంతో ఇటువంటి శిక్షణా కార్యక్రమాలు మరిన్ని ముందుకు సాగాలని ఎంపీ రవిచంద్ర అభిలషించారు. 

Mp vaddiraju : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టీ.రామారావు పుట్టినరోజు సందర్భంగా జూలై 24వతేదీన "స్మైల్ ఏ గిఫ్ట్"పేరుతో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి వరంగల్ లో  2వేల మంది మహిళలకు కుట్టుమిషన్లు బహుకరించారని గుర్తు చేశారు. తన గాయత్రి గ్రానైట్స్ నుంచి,జీ మాల్ ఉమా మహేశ్వర రావు సహాయంతో మరికొందరు మహిళలకు కుట్టు మిషన్లు అందజేస్తామని, సామాజిక బాధ్యతలో భాగంగా ఈ కేంద్రం విస్త్రృతికి కృషి చేస్తానని ఎంపీ రవిచంద్ర చెప్పారు.కొద్ది పెట్టుబడితో చిన్నగా మొదలుపెట్టి కోట్ల రూపాయల టర్నోవర్ కు చేరుకున్న వ్యాపారులను సూరత్, బెంగళూరు తదితర చోట్ల తాను చూశానన్నారు.క్రమశిక్షణతో కష్టపడి పని చేయడం,వృత్తి నైపుణ్యాన్ని పెంచుకోవడం ద్వారా జీవితంలో ఉన్నతంగా ఎదగొచ్చని,అటువంటి వారికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని ఎంపీ రవిచంద్ర వివరించారు. ఈ సందర్భంగా ఎంపీ వద్దిరాజుకు నిర్వాహకులు పూల కుండీ బహుకరించి శాలువాతో సత్కరించారు.ఈ కార్యక్రమంలో చల్లా సుధా, సుందరరావు, స్వప్న, ఖతీజా, ఆవుల నాగమణి, ఉమా తదితరులు పాల్గొన్నారు.

Tags: