లుక్ పరంగానే కాదు ఉపయోగానికి సౌకర్యంగా..
రాజసం లోనూ రాజీ లేని నైపుణ్యం..
చూపరులను కట్టిపడేసే కళాత్మక..
ఫర్నిచర్ రంగంలో ప్రపంచస్థాయి ఎంపిక..
కార్పొరేట్ కంపెనీల్లో కీలకంగా మారిన ఆఫీస్ సెటప్..
ప్రొఫెషనల్స్ అసిస్టెన్స్ గా ఫర్నిచర్ పాత్ర..
చెన్నై కేంద్రంగా సేవలందిస్తున్న జడ్ టూ ఏ..
Furniconcepts : నిత్యం హైదరాబాద్ ఐటీ కారిడార్ మీదుగా ప్రయాణించే వారికి వరుసగా కనిపించే గాజు, ఉక్కుతో నిర్మించిన కార్పొరేట్ భవనాలు సుపరిచితమే. ఎప్పుడూ కొత్తగా.. స్టైల్ లుక్ తో నిత్యనూతనంగా చూపరులను తమదైన కళాత్మకత తో కట్టిపడేసే ఆ భవనాలు.. అందులోని ఫర్నిచర్ వాటి లోని కార్యాలయాల్లో పని చేసే సిబ్బందికి అద్భుతమైన పని అనుభవాన్ని ఇవ్వడమే కాదు చేసే పనిలోనూ ఉత్సాహం బడలిక లేని సౌకర్యాన్ని అందిస్తూ.. అటు ఉద్యోగులకు ఇటు యాజమాన్యానికి ప్రెండ్లీ వాతావరణాన్ని కల్పిస్తున్నాయి. అంతేకాదు సంస్థ ఉన్నతికి దోహదపడి లాభాల బాట పట్టిస్తున్నాయి. ఇదంతా వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా, వ్యాపార రంగంలో ఆఫీస్ ఫర్నిచర్ నేడు ఆ సంస్థ దిశను దశనే మార్చి వేస్తుందంటే నమ్మక తప్పదు.

విలాసవంతమైన ఆధునిక సౌకర్యం..
Furniconcepts : కార్పొరేటర్ దిగ్గజ సంస్థలకు సరి జోడిగా రాజసాన్ని ఒలకబోస్తూ.. అందులో పని చేసే సిబ్బందికి ఉత్సాహాన్ని కొత్త ఉత్తేజాన్ని కలిగిస్తూ z to a ఫర్నీకాన్సెప్ట్ సంస్థ అందించే ఫర్నిచర్ అందులో పని చేసే వేలాది మంది ఉద్యోగులకు పనిలో విలాసవంతమైన సౌకర్యాన్ని అందిస్తున్నాయి. పొందికగా అమర్చిన వేలాది డెస్కులు, కుర్చీలు, డెస్క్ స్క్రీన్, స్టోరేజ్‌తో కూడిన పూర్తి వర్క్‌స్టేషన్ అమరిక సంస్థ ప్రతిష్టను ప్రతిబింబించడమే కాకుండా ఉద్యోగులకు పనిలో ఏకాగ్రతకు దోహదపడతాయి.

ప్రపంచ స్థాయి ఎంపిక..
Furniconcepts : పెద్ద పెద్ద ఆఫీస్ ప్రాజెక్ట్‌లలో ఫర్నిచర్ ఏర్పాటు ఎంతో కీలకం. ఫర్ని కాన్సెప్ట్ ( Furniconcepts ) సంస్థ Redington కార్యాలయంలో అనేక అంతస్తులకు ఫర్నిచర్‌ను అమర్చిన తీరును చూస్తే ఈవిషయం అర్థమవుతుంది. హైదరాబాద్‌లో పెద్ద పెద్ద కార్పొరేట్ ఫిట్-అవుట్ ప్రాజెక్ట్‌లను చేపట్టే ఆర్కిటెక్ట్‌లు, కాంట్రాక్టర్లకు కొన్ని కీలక అంశాలను స్పురణకు తెచ్చే ఈ ప్రాజెక్ట్ చూస్తే మతిపోవాల్సిందే. అయితే ఈ పనుల వెనుక శ్రమ, శ్రద్ధ, సమన్వయం, అంకితభావం, ప్రాజెక్టు వివరాలు బయటకు వచ్చినప్పుడే తెలుస్తుంటాయి.

భారత్‌లో చెన్నై కేంద్రంగా ..
భారత్‌లో చెన్నై కేంద్రంగా పనిచేసే Z to A Furniconcepts India సంస్థ ఇప్పటికే ఎన్నో బహుళ అంతస్తుల ప్రాజెక్టును చేపట్టింది. టెక్నాలజీ డిస్ట్రిబ్యూషన్ సంస్థ Redington కు చెందిన Mahesh, ఫర్ని కాన్సెప్ట్స్ ( Furniconcepts ) భారతీయ వెబ్సైట్లో ఈ ప్రాజెక్టు గురించి వివరించారు. తాము నిర్వహిస్తున్న వాణిజ్య ఫర్నిచర్ సంస్థ Furniconcepts ఇప్పటికే అనేక అంతస్తుల్లో ఫర్నిచర్ ఏర్పాటు చేసిన విషయం మహేష్ వెల్లడించారు. ఈ పనిలో లాజిస్టిక్స్‌ను సమర్థంగా నిర్వహించి, ఇన్‌స్టాలేషన్‌ను నిర్ణీత షెడ్యూల్ కంటే ముందే పూర్తి చేశారని ఆయన పేర్కొన్నారు. బృందం చూపిన వృత్తి నైపుణ్యాన్ని కూడా ప్రశంసించారు.
పెద్ద ప్రాజెక్టుల్లో నిర్ణీత గడువు కంటే ముందే పని పూర్తి చేయడం ఎలా సాధ్యమవుతుంది? అనే అంశంపై వివరణ ఇస్తూ.. బహుళ అంతస్తుల కార్యాలయాల్లో ఫర్నిచర్ ఏర్పాటు సాధారణంగా చివరి దశలో జరిగే పని అని తెలిపారు. అయితే, కార్యాలయం వినియోగంలోకి వచ్చిన తర్వాత అందరి దృష్టినీ ఆకర్షించేది కూడా అదే అన్నారు. ఫర్నిచర్ డెలివరీలు లిఫ్ట్‌ల అందుబాటు సమయాలకు, లోడింగ్ బే వినియోగానికి అనుగుణంగా ఉండాలనీ , ఇతర పనులకు ఆటంకం కలగకుండా ఒక్కో అంతస్తులో పనులు క్రమంగా పూర్తిచేయాలన్నారు. వర్క్స్టేషన్ల అమరిక, ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ ఇప్పటికే ఏర్పాటు చేసిన విద్యుత్, డేటా కనెక్షన్ పాయింట్లకు సరిపోయేలా చూడడం ముఖ్యం అన్నారు. వీటిలో ఏ ఒక్క అంశంలో ఆలస్యం జరిగినా, మొత్తం ప్రాజెక్టు అప్పగింతపై ప్రభావం పడుతుందన్నారు. అందుకే విద్యుత్, ఇతర భవన సదుపాయాల ప్రణాళికను ఖరారు చేసే సమావేశంలోనే అంతస్తుల వారీగా ఫర్నిచర్ షెడ్యూల్‌ను కూడా నిర్ణయించడం అవసరం అని వివరించారు. డెలివరీ, అసెంబ్లీ, చివరి తనిఖీలో గుర్తించే లోపాల సవరణ వంటి పనులకు ఒకే సరఫరాదారు బాధ్యత వహించేలా చూడటం వల్ల సమన్వయం సులభమవుతుందన్నారు. భారీ స్థాయిలో ఫర్నిచర్ డెలివరీ చేయడానికి కొన్ని వారాల ముందే కుర్చీ, డెస్క్ స్క్రీన్, స్టోరేజ్‌తో కూడిన పూర్తి వర్క్‌స్టేషన్ నమూనాను కార్యాలయంలో ఏర్పాటు చేయడం మరో ఉపయోగకరమైన చర్య అని తెలిపారు. దీనివల్ల క్లయింట్ డ్రాయింగ్‌ను మాత్రమే కాకుండా, వాస్తవంగా అమర్చిన నమూనాను పరిశీలించి ఆమోదం తెలపవచ్చన్నారు.

ఫర్ని కాన్సెప్ట్ ప్రత్యేకత..
భారత్‌లో Furniconcepts కార్యాలయాలకు అవసరమైన వివిధ రకాల ఫర్నిచర్‌ను అందిస్తోంది. ఎర్గోనామిక్ టాస్క్ కుర్చీలు, ఎగ్జిక్యూటివ్ కుర్చీలు, వర్క్స్టేషన్లు, ఎత్తును సర్దుబాటు చేసుకునే డెస్కులు, మీటింగ్ టేబుళ్లు, స్టోరేజ్ యూనిట్లు, అకౌస్టిక్ పాడ్లు ఇందులో ఉన్నాయి. వర్క్స్టేషన్ల కోసం Gebbwork, సౌండ్‌ప్రూఫ్ పాడ్ల కోసం Musepod వంటి బ్రాండ్లతో పాటు, భారత్‌లోనే తయారు చేసే Work lyffe ఉత్పత్తులూ అందుబాటులో ఉన్నాయి. దేశీయంగా తయారయ్యే ఉత్పత్తులు అందుబాటులో ఉండటం వల్ల పెద్ద ఆర్డర్లలో అంతర్జాతీయ రవాణా సమయాలపై ఆధారపడటం తగ్గించవచ్చు.

భారత్‌లో ఫర్నికాన్సెప్ట్స్ ( Furniconcepts ) Redington కు మాత్రమే కాదు చెన్నైలోని SICCI ఛాంబర్ కార్యాలయానికి, Redington OMR లోని KoDesk కో-వర్కింగ్ స్థలానికి కూడా సంస్థ ఫర్నిచర్‌ను అందించింది. చెన్నైలోని దాని ల్యాబ్ షోరూమ్‌లో వినియోగదారులు కుర్చీలను పరీక్షించి, ఫినిష్‌లను ప్రత్యక్షంగా పరిశీలించవచ్చు. వందలాది యూనిట్లకు ఆర్డర్ ఇచ్చే ముందు ఉత్పత్తులను పరిశీలించే అవకాశం పెద్ద ప్రాజెక్టుల్లో నిర్ణయాలు తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. సంస్థ వినియోగదారులు చెన్నై, కోయంబత్తూరు నుంచి హైదరాబాద్, పుణె, ముంబై, ఢిల్లీ వరకు ఉన్నారనడం అతిశయోక్తి కాదు. అంతేకాదు సంస్థకు అంతర్జాతీయ బహుళ అంతస్తుల్లో ఫర్నిచర్ ఏర్పాటు చేసిన అనుభవం కూడా ఉంది. దుబాయ్‌లోని New Burj Daman Tower లో ఏడో, ఎనిమిదో అంతస్తుల్లో ఉన్న Index కార్యాలయాలకు Furniconcepts పూర్తి స్థాయి ఆఫీస్ ఫర్నిచర్ అందించింది. Al-Futtaim Engineering కార్యాలయాల విస్తరణ పనుల్లోనూ సంస్థ పలుమార్లు భాగస్వామ్యమైంది. రెండు అంతస్తులను ఒకే ప్రాజెక్టుగా నిర్వహించడం, ఫినిష్‌లలో ఒకే ప్రమాణాన్ని పాటించడం, నిర్ణీత గడువులో పనులను అప్పగించడం—ఇవన్నీ సంస్థ సమర్థవంతమైన ప్రణాళిక, సమన్వయాన్ని సూచిస్తున్నాయి. Redington ప్రాజెక్టులోనూ ఈ అంశాలు కీలకంగా నిలిచాయని
చెప్పవచ్చు.
ఫర్ని కాన్సెప్ట్స్ గురించి..
Furniconcepts వ్యాపారం 1995లో ఒమాన్ లో ప్రారంభమైంది. 2021లో దాని కార్యకలాపాలను Furniconcepts బ్రాండ్ కింద ఏకీకృతం చేయగా, 2022లో భారత్‌లో కార్యకలాపాలు ప్రారంభించింది. ప్రస్తుతం ఐదు దేశాల్లో 350కు పైగా క్లయింట్లకు సేవలందిస్తున్నట్లు సంస్థ తెలిపింది. దాని నాణ్యతా నిర్వహణ వ్యవస్థ ISO 9001:2015 ధ్రువీకరణ పొందింది. ప్రాజెక్టుల షెడ్యూలింగ్, పర్యవేక్షణ కోసం సంస్థ తన సొంత AI ఆధారిత ERP ప్లాట్‌ఫారమ్ అయిన Furnishareను ఉపయోగిస్తోంది.
తెలంగాణలో కార్యాలయాల విస్తరణ కొనసాగుతున్న నేపథ్యంలో, పెద్ద భవనాల్లో ఫర్నిచర్ ఏర్పాటు కోసం ఎన్నో కంపెనీలు ఫర్ని కాన్సెప్ట్స్ సంస్థను ఆశ్రయిస్తున్నాయి. సమన్వయంతో కూడిన ప్రాజెక్టు వర్క్, ప్రణాళిక బద్ధమైన కార్యాచరణ నిపుణతతో, నిర్ణీత గడువులో పనులను పూర్తి చేసి అప్పగించాల్సిన కాంట్రాక్టర్లు ఫర్ని కాన్సెప్ట్స్ సరఫరాదారును ప్రారంభ దశలోనే ప్రాజెక్టులో భాగం చేయడం ఎంతో ఉపయోగకరం. డెలివరీ, ఇన్స్టాలేషన్, షెడ్యూలింగ్‌ను సమన్వయం చేయగల సరఫరాదారును ముందుగానే ఎంపిక చేసుకోవడం వల్ల ప్రాజెక్టు చివరి దశలో తలెత్తే సమస్యలను తగ్గించవచ్చు.




