Free health camp : సంఘ సేవకుడు మనసున్న నాయకుడు పేదల పక్షపాతి కీ. శే. పల్లా జాన్ రాములు సమాజానికి అందించిన సేవలు చిరస్మరణీయమని డోర్నకల్ బిషప్ రెవ.డా.కె.సేనం రాజు అన్నారు. మంగళవారం ఖమ్మం మిషన్ హాస్పిటల్ ప్రాంగణంలో పల్లా జాన్ రాములు 88 వ జయంతి సందర్భంగా ఆయన కుమారుడు ప్రముఖ సమాజ సేవకుడు పల్లా కిరణ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత జనరల్ వైద్య శిబిరం, ఉచిత జనరల్ కంటి వైద్య శిబిరాన్ని ( Free health camp ) రెవ.కె.సేనం రాజు చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తండ్రి ఆశయాలను నెరవేర్చేందుకు కుమారుడు పల్లా కిరణ్ పేద ప్రజలకు అందిస్తున్న సేవలను కొనియాడారు. పేదల పక్షపాతి, పీడిత ప్రజల నాయకులు అయిన పల్లా జాన్ రాములు చివరి క్షణం వరకు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పాటు పడ్డారన్నారు. అనంతరం పల్లా కిరణ్ కుమార్ మాట్లాడుతూ చిన్నతనం నుండి తన తండ్రి చేస్తున్న సేవా కార్యక్రమాలను చూస్తూ పెరిగిన తాను ఆయన ఆశయాలను కొనసాగించేందుకే ఆయన స్ఫూర్తితో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు.

Free health camp : గత 20 సంవత్సరాలుగా వివిధ వర్గాల ప్రజల కోసం అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించినట్లు పల్లా కిరణ్ తెలిపారు. సంవత్సరానికి 2 రెండు సార్లు ఉచిత మోగా వైద్య శిబిరాల ఏర్పాటు. కరోనా సమయంలో 3000 మందికి మామిడికాయ పచ్చడి పంపిణీ, ప్రైవేటు టీచర్స్ పేదలకు బియ్యం, నిత్యవసర సరుకులు పంపిణీ వంటి కార్యక్రమాలు చేపట్టినట్టు తెలిపారు. వరదల సమయంలో నిత్యం అందుబాటులో ఉంటూ వరద బాధితులకు ఆహారం, నీరు, నిత్యవసర సరుకులు, బట్టలు పంపిణి ఇలా ఆపదల సమయంలో అన్ని వర్గాల ప్రజలకు అనేక సందర్భాల్లో అండగా ఉన్నట్టు వెల్లడించారు. పేదలకు అన్న దానాలు, నిరుపేద విద్యార్ధిని, విద్యార్థులకు ప్రాథమిక, ఉన్నత విద్య కొరకు ఆర్ధిక సహాయం. నీటి కొరత ఉన్న ప్రాంతాలలో సొంత ఖర్చుతో బోర్లు ఏర్పాటు ట్యాంకర్ ద్వారా మంచినీటి సరఫరా వృద్ధులకు, వికలాంగులకు, మహిళలకు, అనాధ బాలబాలికలకు యువతకు నిత్యం అనేక విధాలుగా అండగా ఉంటూ సహాయ సహకారాలు అందిస్తు అండగా ఉండడం సంతోషంగా ఉందన్నారు.

Free health camp : ఉచిత జనరల్ వైద్య శిబిరం ఉచిత జనరల్ కంటి వైద్య శిబిరానికి ఖమ్మం ప్రజల నుండి భారీ స్పందన లభించిందని కిరణ్ తెలిపారు. సుమారు 1000 మందికి పైగా నిరుపేద ప్రజలు వర్షాన్ని కూడా లెక్కచేయకుండా వైద్యం చేయించుకుని ఉచితంగా మందులు తీసుకోవడం జరిగిందని,. సుమారు 300 మంది పైగా నిరుపేద ప్రజలకు ఉచిత కళ్ళజోళ్ళు అందించామన్నారు. కార్యక్రమంలో రెవ. డాక్టర్ విశ్వం, జి. ప్రభాకర్ రావు, రెవ.బి. శ్రీనివాస్ పాల్, రెవ.ఇశ్రాల్ రెడ్డి, ఎల్లయ్య (రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్), చిలకబత్తిని కనకయ్య పాల్గొని పల్లాకిరణ్ ని అభినందించారు. డా.రఘు, డా.సృజన్, డా.రాజు కుమార్, డా.హరికృష్ణ, గంట కిరణ్, పల్లా కిరణ్ యూత్ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసారు.








