*ఉస్మానియా ఆసుపత్రి మార్చురీ వద్ద నివాళులు అర్పించిన మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి*
*ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో ప్రవళిక తల్లికి ఉద్యోగం, ఇందిరమ్మ ఇళ్లు ,ప్రభుత్వం & ఆర్టీసీ నుండి 10 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా, కోటి రూపాయల ప్రమాద బీమా..*
Rtc conductor : ఆర్టీసీ కండక్టర్ ప్రవళిక మృతి చెందింది. ఆమె మృతి వార్త తెలుసుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. ఉస్మానియా హాస్పిటల్ మార్చురీకి వెళ్లి ప్రవళిక మృతదేహానికి నివాళులర్పించారు. ఆమె కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. ప్రభుత్వం, ఆర్టీసీ నుండి అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ ఘటన జరిగిన వెంటనే మేనేజ్మెంట్ తరఫున ఆసుపత్రికి వెళ్లి మెరుగైన వైద్యం కోసం ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. మంచి చికిత్స అందించే ప్రయత్నం చేసినాం కానీ దురదృష్టవశాత్తూ కండక్టర్ ప్రవళిక దూరమైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంఘటనలో దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకూడదని, ఒకవేళ మా సిబ్బంది ఎక్కడైనా పొరపాటుగా ప్రవర్తించి ఉంటే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయండి చర్యలు తీసుకుంటామన్నారు. కానీ నేరుగా ప్రజలే చట్టాన్ని చేతిలోకి తీసుకొని తోసివేయడం వల్ల ఇవాళ ఒక కుటుంబం రోడ్డున పడ్డదన్నారు.

*ఆ కుటుంబానికి ఆర్టీసీ అండగా ఉంటుంది..*
Rtc conductor : ఆర్టీసీ కండక్టర్ ప్రవళిక తల్లికి ఉద్యోగంతో పాటుగా ఒక ఇందిరమ్మ ఇల్లు, ప్రభుత్వం తరఫున, ఆర్టీసీ తరఫున రూ. 10 లక్షలు ఇవ్వడంతో పాటు ఆర్టీసీ తీసుకున్న నిర్ణయం ప్రకారం వారి కుటుంబానికి ఒక కోటి రూపాయల బీమా బ్యాంక్ నుండి లభిస్తుందని మంత్రి తెలిపారు. ఫైనాన్షియల్ గా ఇబ్బంది లేకున్నా కోల్పోయిన కుటుంబ సభ్యురాల్ని ఎవ్వరం తిరిగి తీసుకురాలేమన్నారు.
Rtc conductor : ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది ఉంటే ఎవరైనా పొరపాటున మా వాళ్ళు ఏమైనా ఇబ్బంది పెడితే పిర్యాదు చేయవచ్చు చర్యలు తీసుకుంటాం.. ఇలాంటి దాడులు సరికాదన్నారు. దయచేసి ప్రయాణికులు అర్థం చేసుకుని సహకరించాలని కోరారు.






